NTV Telugu Site icon

Maharashtra Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!

Maharashtra Fire Accident

Maharashtra Fire Accident

6 dead in Maharashtra Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హ్యాండ్‌ గ్లవ్స్‌ తయారీ కంపెనీలో చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఔరంగాబాద్‌ సమీపంలోని వలుజ్‌ ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కస్టపడి.. ఆదివారం ఉదయం వరకు మంటలు అదుపులోకి తెచ్చారు.

వివరాల ప్రకారం… ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో వలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని హ్యాండ్‌ గ్లవ్స్‌ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకునే కాసేపటికే కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 10-15 మంది నిద్రిస్తున్నారు. అప్రమత్తమైన కొందరు తప్పించుకోగా.. ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఉదయం వరకు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Show comments