Maharashtra : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజనం వడ్డించడంలో చిన్న వివాదంతో 26 ఏళ్ల యువకుడు తన సొంత తల్లికి నిప్పంటించాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా కాలిపోయిన మహిళ గురువారం (అక్టోబర్ 26) ఉదయం అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Suma Kanakala : అయ్యో.. సుమకు ఎన్ని కష్టాలో.. వీడియో చూస్తే నవ్వాగదు..
మహిళను చంగునా నామ్‌దేవ్ ఖోట్‌గా గుర్తించారు. నిందితుడు జయేష్. నేరం చేసిన తర్వాత తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా రేవ్‌దండా సమీపంలోని నవ్‌ఖర్ గ్రామంలో జరిగింది. మంగళవారం సాయంత్రం వంట విషయంలో ఆ వ్యక్తి తల్లితో గొడవ పడ్డాడు. ఆ వృద్ధురాలు తనను తొమ్మిది నెలల పాటు తన కడుపులో మోసి, కనిపెంచిన కన్న కొడుకు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఊహించి ఉండదు.
Read Also:Mehreen Pirzada : చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హనీ బేబీ క్యూట్ ఫోజులు.. ఫ్యాన్స్ ఫిదా..
ఆహారం వడ్డించడంలో జరిగిన చిన్న వివాదం తర్వాత కోపోద్రిక్తుడైన వ్యక్తి మొదట తల్లిని కొట్టాడని, ఆపై రక్తస్రావంతో ఇంట్లో పడిపోగా కుమారుడు వృద్ధురాలిని ఇంట్లోని ఖాళీ స్థలంలోకి లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు. అక్కడ తల్లికి నిప్పంటించాడు. వృద్ధురాలి అరుపులు, శబ్దాలు విన్న స్థానికులు గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రావ్‌దండ పోలీస్‌స్టేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు జయేష్‌పై హత్య సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.