Maharashtra: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సర్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది. “ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి”పై దేశ వ్యతిరేక నినాదాలను సహించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. పీఎఫ్‌ఏ సంస్థపై ఈడీ, సీబీఐ దాడులను నిరసిస్తూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు పుణెలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేశారు. ఈ ఘటనను సీఎం ఏక్‌నాథ్ షిండే ఖండించారు.
పుణెలో లేవనెత్తిన దేశవ్యతిరేక ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలను ఎంత ఖండించినా సరిపోదని… పోలీసులు తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారన్నారు. వారికి ఆదేశాలను జారీ చేశామన్నారు. కానీ శివాజీ భూమిపై ఇలాంటి నినాదాలు చేస్తే సహించబోమని ఏక్‌నాథ్ షిండే ట్వీట్ చేశారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
पुण्यात ज्या समाजकंटकांनी पाकिस्तान झिंदाबादचे नारे दिले त्या प्रवृत्तीचा करावा तेवढा निषेध कमीच आहे. पोलीस यंत्रणा त्यांच्याविरोधात योग्य ती कारवाई करेलच, पण शिवरायांच्या भूमीत असले नारे अजिबात सहन केले जाणार नाहीत.
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) September 24, 2022
ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని విడిచిపెట్టబోమని హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అన్నారు.నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్ మాట్లాడుతూ, “మహారాష్ట్రలో లేదా భారతదేశంలో ఎవరైనా ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం చేస్తే, ఆ వ్యక్తిని వదిలిపెట్టరు. వారిపై చర్యలు తీసుకుంటారు, వారు ఎక్కడ ఉన్నా వారిని పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటాం.” అని ఫడ్నవీస్ అన్నారు.
Pune Police takes cognizance of the slogan raised during the PFI protest yesterday and is investigating all slogans raised in the protest: Pune Police https://t.co/77xzeYV1km
— ANI (@ANI) September 24, 2022
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!