బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వచ్చారు. ముఖ్యమంత్రికి సల్మాన్‌ఖాన్, కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికారు. కుటుంబ సభ్యుల్ని సీఎం షిండే పలకరించారు. అనంతరం కాల్పుల పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి నేరుగా.. సల్మాన్ నివాసానికి వచ్చి పరామర్శించారు.
ఆదివారం తెల్లవారుజామున సల్మాన్‌ఖాన్ నివాసంపై దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు దండగులు బైక్‌పై వచ్చి ఐదు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే కాల్పుల అనంతరం నిందితులు గుజరాత్‌కు పారిపోయారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. గుజరాత్‌కి వెళ్లి ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ శ్రీజోగేంద్ర పాల్ (21)లకు ఈనెల 25 వరకు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 14 రోజులు కస్టడీ కోరగా.. 9 రోజులు కస్టడీకి అంగీకరించింది.
పోలీస్ కస్టడీలో సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు?, కాల్పులకు అసలు కారణమేంటో తెలుసుకోనున్నారు. ఈ ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించిందని నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు నవీ ముంబై పన్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉంది. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పాత యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని సైతం ప్రశ్నించారు. ద్విచక్ర వాహనం పాత యజమానిది కూడా పన్వెల్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ దగ్గరకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డారు. బాల్కనీలో పడ్డ బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఏమైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. సల్మాన్‌ఖాన్‌ను భయపెట్టేందుకే ఈ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బీహార్‌కు చెందిన వారు కావడంతో అక్కడికి కూడా పోలీసులను పంపించారు. కారణాలు తెలుసుకునేందుకు నిందితుల కుటుంబ సభ్యుల్ని కూడా విచారించనున్నారు.
షిండే కామెంట్స్..
సల్మాన్‌ఖాన్‌ను కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. సల్మాన్‌ఖాన్‌తో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కాల్పుల ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి ముఠా ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గ్యాంగ్‌లను, గూండాలను నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సల్మాన్‌ఖాన్ కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు ఆదేశించినట్లు చెప్పారు. జాగ్రత్తగా చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని షిండే చెప్పుకొచ్చారు.
#WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9
— ANI (@ANI) April 16, 2024
#WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence.
Inside visuals from the residence.
(Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm
— ANI (@ANI) April 16, 2024
#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at the residence of actor Salman Khan.
On the firing incident outside actor Salman Khan's residence on April 14, CM Eknath Shinde says, "I met with Salman Khan and assured him the government is with him. I also directed the police… pic.twitter.com/liweoYNtmX
— ANI (@ANI) April 16, 2024