NTV Telugu Site icon

IRCTC Maharajas Express : మీరు రాజులైతేనే ఈ ట్రైన్లో ఎక్కాలి.. ఎందుకంటే టిక్కెట్ ధర రూ.19లక్షలు

Irctc

Irctc

IRCTC Maharajas Express : సాధారణంగా బస్సు కంటే రైటు టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఖర్చు తక్కువగానూ సౌకర్య వంతంగా ఉంటుందని ఎక్కువ మంది రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతారు. ఎక్కువ దూరం ప్రయాణించాలంటూ రైల్లో హాయిగా బెర్త్ బుక్ చేసుకుని ఎంచక్కా నిద్రపోతూ ప్రయాణం కొనసాగించొచ్చు. ఇటు పేదలకు, అటు సంపన్నులకు ఎలాంటి సేవలనైనా అందజేస్తుంది భారతీయ రైల్వే. కానీ భారత్ లోనే ఓ రైలు టికెట్ ఉంది. దాంట్లో ప్రయాణించాలంటే విమాన ప్రయాణం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ రైలు టికెట్ ధర ఏకంగా అక్షరాలా రూ.19 లక్షలు. అంతలా విమాన టిక్కెట్ కూడా ఉండదనుకుంటున్నారా..? నిజమే మరి. ఆ రైలే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిర్వహించబడుతున్న మహారాజాస్ ఎక్స్‌ప్రెస్..ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది మహారాజాస్ ఎక్స్‌ప్రెస్.

Read Also: Khushbu: నటి ఖుష్బూ ఇంట విషాదం !

‘మహారాజాస్ ఎక్స్‌ప్రెస్’ వివిధ మార్గాల్లో ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. లగ్జరీ అంటే అలాంటిలాంటి లగ్జరీ కాదు. ఇదో ఓ చిన్న లగ్జరీ విల్లాలాంటిది. పేరుకు తగినట్లే ధర కూడా ఉంది. లోపల ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ ఉంటుంది. ఈ రైలులో ఒక కోచ్‌ను మొత్తం లగ్జరీ విల్లాలా తీర్చి దిద్దారు. అన్ని ఉన్నాయి దీంట్లో. నిద్రవస్తే పడుకోవటానికి రెండు బెడ్‌రూమ్‌లు, ఓ లివింగ్‌ ఏరియా, ఏ క్లాస్ వాష్‌రూమ్స్ తో పాటు అన్నీ లగ్జీరీగానే ఉంటాయి. టీవీ, డీవీడీ ప్లేయర్, ఇంటర్నెట్ ఇలా ఒకటేమిటి అన్నీ ఈరైలులో ప్రయాణంలో ఆస్వాదించొచ్చు.

Read Also: Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ

ఈ రైలుకు సంబంధించిన వీడియోను కుషాగ్రా అనే నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘భారతీయ రైల్వేలో అత్యంత ఖరీదైన ఈ టికెట్ కోచ్‌ని మీరు ఎప్పుడైనా చూశారా..?’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ రైలు టికెట్టు ధర రూ. 19 లక్షల పైమాటే. ఈ లగ్జరీ రైలు ప్రయాణం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.