Earthquake: ఇండోనేషియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం

Earthquake

Earthquake

Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) శుక్రవారం ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:55 గంటలకు బలమైన భూకంపం సంభవించిందని పేర్కొంది.

Read Also: Congress Leader: మున్సిపల్ సీటు కోసం 45 గంటల్లోనే వధువును పట్టిన కాంగ్రెస్ నేత

×
×
Ad

భూకంప కేంద్రం 594 కిలోమీటర్ల (370 మైళ్లు) లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను తోసిపుచ్చింది.ఈ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.