NTV Telugu Site icon

Maga Fans: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ఎవరు?

Gamechanger

Gamechanger

ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో బంపర్ హిట్ కొట్టిన విశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర రిలీజ్ కానుందని డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also Read: Devara: అయ్యో.. మిస్ అయ్యామే! తెగ బాధపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్

చిరంజీవి ప్లేస్‌లో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ రానుందనే టాక్ ఊపందుకుంది. ఎస్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. దిల్ రాజు కూడా క్రిస్మస్ టార్గెట్‌గా గేమ్ ఛేంజర్ ప్లాన్ చేస్తున్నామని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదని తెలుస్తోంది. ఒకవేళ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తే.. విశ్వంభర ఎప్పుడు అనేది చూడాలి. డిసెంబర్‌లో చరణ్, సంక్రాంతికి బాస్ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ బద్దలు చేస్తారని ఎదురు చూస్తున్న మెగా అభిమానులు.. ఈ వార్తతో కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.

Show comments