NTV Telugu Site icon

Madras High Court: భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యలో ఆస్తిలో వాటా

Madras High Court

Madras High Court

Madras High Court: భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు. చనిపోయిన మొదటి భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సేలం సివిల్ కోర్టు కొట్టివేసింది. ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ ధర్మాసనం విచారణ జరిపింది.

Read Also: R Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్‌ రిటైర్‌మెంట్‌కు ఆ ఇద్దరే కారణమా?

హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు.. భర్తను కోల్పోయిన మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని, మళ్లీ వివాహం చేసుకున్న మహిళకు హక్కు లేదన్న హిందూ వివాహ చట్టం సెక్షన్‌ను 2005లోనే రద్దు చేశారని పేర్కొన్నారు. ఆమెకు దక్కాల్సిన ఆస్తులను అప్పగించాలని ఉత్తర్వులిచ్చారు.

Show comments