Panneerselvam: పన్నీర్ సెల్వంకు షాక్.. 11 ఏళ్ల తర్వాత ఆ కేసు పునర్విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Reopens corruption Case against former CM Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు షాక్ తగిలింది. 11 ఏళ్ల తర్వాత అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. వివరాల ప్రకారం.. 2001-06 మధ్య కాలంలో దివంగత జయలలిత ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. రూ. 1.77 కోట్ల మేర అక్రమంగా సంపాదించారంటూ 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే 2011లో అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దీంతో అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Also Read: Viral Video: ఆసుపత్రిలో తుపాకీతో కాల్పులు.. వైరల్ వీడియో
Also Read
- Sheikh Hasina: "నరహంతకురాలు".. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
అయితే ఈ నేపథ్యంలోనే నిందుతులపై ఉన్న ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించడం లేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో శివగంగ కోర్టు 2012లో ఈ కేసులో ఛార్జిషీట్ దఖాలైన వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్ లతో పాటు ఆరగురిపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. అయితే ఏసీబీ విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వీరు కేసు నుంచి బయటపడ్డారు. అయితే 11 ఏళ్ల తరువాత ఈ కేసును సుమోటాగా తీసుకొని పునర్విచారించేందుకు మద్రాస్ హైకోర్టు సిద్దమయ్యింది.
ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన ఏసీబీ, దిగువ కోర్టులపై కూడా ఉన్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్షాలపై కేసులు పెట్టడం మళ్లీ ప్రతిపక్షాలు అధికారంలోకి రాగానే ఆ కేసులు లేకుండా చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో అలవాటుగా మారిపోందని, ఈ విషయంలో అవినీతి విచారణ సంస్థలు కూడా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక దిగువ కోర్టుల తీర్పుపై 12 ఏళ్లు గడిచినా పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని… ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే పన్నీర్ సెల్వం కేసుపై పునర్విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. దీంతో పన్నీర్ సెల్వం మరోసారి చిక్కుల్లో పడినట్లు అయ్యింది.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!