Site icon NTV Telugu

Kidney Racket: కిడ్నీ రాకెట్ వ్యవహారం.. గ్లోబల్ ఆస్పత్రి సీజ్, పలువురి అరెస్ట్..!

Madanapalli

Madanapalli

Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఒక మహిళ మృతి చెందడం, పలువురు వైద్యులు, ముఠా సభ్యులు అరెస్టు కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలను పద్మ అనే మహిళ మదనపల్లికి తీసుకొచ్చింది. వీరిపై గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆ ఆపరేషన్‌లో యమున అనే మహిళ పరిస్థితి విషమించి మరణించింది. దీనితో యమున కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మదనపల్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాంతో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Sandeep Chakravarthi: సెల్యూట్..! ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఈ తెలుగు అధికారి పాత్ర కీలకం..

పోలీసులు దర్యాప్తు చేపట్టి.. కిడ్నీ రాకెట్ ముఠాలో కీలక నిందితుడిగా నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు. అంతేకాకుండా ఈ ముఠాతో కలిసి పనిచేస్తున్న గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ రాకెట్‌కు సహకరిస్తున్న పద్మ అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ రాకెట్ బహిర్గతం కావడంతో మదనపల్లిలోని గ్లోబల్ హాస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో హాస్పిటల్ యజమాని డా. ఆంజనేయులు, మరో వైద్యుడు, అలాగే విశాఖకు చెందిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య లపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు.

Investments in Amaravati: రూ.50,000 కోట్ల లక్ష్యం.. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు..!

ముఠా సభ్యుల మధ్య డబ్బు పంచుకునే విషయంలో తిరుపతిలో గొడవలు తలెత్తడంతో విషయం బయటపడింది. ఒకరికొకరు ఘర్షణకు దిగడంతో పోలీసుల దృష్టికి ఈ వ్యవహారం వచ్చింది. దీని ఫలితంగా మొత్తం కిడ్నీ రాకెట్ నెట్‌వర్క్ బి బయట అయ్యింది. అంతేకాకుండా పోలీసులు ల్యాబ్ టెక్నీషియన్లపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

Exit mobile version