NTV Telugu Site icon

Madhyapradesh : చితిపై నుంచి లేచిన వ్యక్తి.. భయంతో పరుగు తీసిన జనం..

Madyapradeh Dead Body

Madyapradeh Dead Body

ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడు. మోరీనాలో దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు మేల్కొన్న వ్యక్తి, వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మే 30న జరిగినట్లు తెలుస్తోంది.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జీతూ ప్రజాపతి అనే వ్యక్తి మే 30 న హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన ఉలుకుపలుకు లేదు..

ఇక అతన్ని కుటుంబ సభ్యుల సహా స్నేహితులు, ఇరుగుపొరుగువారు జీతూ మరణించాడని భావించారు. దీంతో సాంప్రదాయ పద్దతితో జీతుకి అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. మోరీనాలోని 47వ వార్డులోని శాంతిధామ్‌కు మృత దేహాన్ని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. చితిని పేర్చి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో అతను నిద్ర లేచినట్లు మేల్కొన్నాడు. హఠాత్తుగా అకస్మాత్తుగా జీతూ శరీరం కదలడం ప్రారంభించడంతో అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశారు..ఆ తర్వాత డాక్టర్ ను తీసుకువచ్చారు.. అతను పరీక్షించి గుండె కొట్టుకుంటుందని అతనికి వైద్యాన్ని అందిస్తున్నారు..ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..