Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైట్ వింగ్ గ్రూప్ వివాదాస్పద ప్రకటన చేసింది. ముస్లిం మహిళతో పారిపోయిన హిందూ యువకులకు రివార్డ్ ప్రకటించింది. రూ. 11,000లను బహుమతిగి ఇస్తామని చెప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను నిరోధించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం మత స్వేచ్ఛ చట్టం 2021 ఉన్నప్పటికీ.. హిందూ ధర్మ సేన అనే సంస్థ ఈ ప్రకటన చేసింది. హిందూ ధర్మ సేన అధ్యక్షుడు యోగేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశాడు.
తన కుటుంబం ఇష్టానికి వ్యతిరేకంగా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయికి, ఆమె తల్లిదండ్రులు పిండప్రధానం చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం యువకులు లవ్ జిహద్ ద్వారా హిందు యువతులను మతం మార్చడం తీవ్రం ఆందోళన కలిగించే విషయమని.. హిందువులలో పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య తక్కువగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, ముస్లిం యువతులను లేపుకెళ్లాలని హిందూ ధర్మ సేన వివాదాస్పద ప్రకటన చేసింది. ముస్లిం మహిళలను పెళ్లి చేసుకుంటే హిందూ యువకులకు రూ. 11,000 ఇస్తామని యోగేష్ అగర్వాల్ అన్నారు.
Read Also: AI: తీవ్ర ప్రమాదంలో మానవుడు.. 5-10 ఏళ్లలో ఏఐ మానవాళిని నాశనం చేయగలదు
ఈ ప్రకటనపై చర్యలు తీసుకుంటారా..? అని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాను ప్రశ్నించగా.. ముందుగా అది ఏ సేన అనేది చూద్ధాం అని అన్నారు. రాష్ట్రంలో గురువా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సింగపూర్ జిల్లాలో ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి హిందూ మతంలోకి మారి సోనాలి రాయ్ ను వివాహం చేసుకున్నాడు. అంతకుముందు ఈ కేసులో వివాహానికి సాక్షులుగా ఉన్నవారికి చంపేస్తామని హిందూ సంఘాలు బెదిరించాయి. దీంతోనే అతను మతం మారి వివాహం చేసుకున్నాడు.
హిందూ ధర్మ సేన ప్రకటనపై భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ మాట్లాడుతూ.. ఈ ప్రకటనను ఖండిస్తున్నట్లు.. దేశం రాజ్యంగం ప్రకారం నడవాలి.. మతాంతర వివాహాల విషయానికి వస్తే కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. మీరు ప్రేమలో పడకుండా ప్రజలను ఆపలేరని, కానీ ఓ నిర్థిష్ట మతం వరకు వస్తే లవ్ జిహాద్ వంటి పదాలు వస్తాయని అన్నారు.