Site icon NTV Telugu

Madhya Pradesh: కదులుతున్న రైలు ముందు దూకి రైల్వే ఉద్యోగి, భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

Suscide

Suscide

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్‌పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.

Read Also: NDA: ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలువనున్న ఎన్డీయే నేతలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిహోడా గ్రామానికి చెందిన నరేంద్ర చాదర్, అతని భార్య రీనా, ఆరేళ్ల కూతురు, 3 నెలల కూతుర్ల మృతదేహాలు రైల్వే ట్రాక్‌పై కనిపించాయని తెలిపారు. అలాగే.. అతని బైక్ సమీపంలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: బ్రాలో మందు తాగే హీరో.. 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌, డైలాగ్స్.. అందుకే పెట్టాం: దర్శకుడు అవ‌నీంద్ర ఇంటర్వ్యూ

ఈ ఘటనపై మృతుడి మామ విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తె రీనా మంగళవారం ఫోన్ చేసి తనకు, ఆమె అత్తగారికి మధ్య గొడవ జరిగిందని చెప్పిందన్నారు. అయితే ఇది సాధారణమూ.. అంతర్గత కుటుంబ సమస్య కావడంతో అతను పట్టించుకోలేదని చెప్పారు. తన అల్లుడు, కుమార్తె ఇంతటి ఘటనకు పాల్పడిన గల కారణాల గురించి తనకు తెలియదని అన్నారు. కాగా.. తన కూతురు, అల్లుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు.

Exit mobile version