NTV Telugu Site icon

Madhya Pradesh: ప్రొఫెసర్‌ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి.. ఆస్పత్రికి తరలింపు

Keej]

Keej]

మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్‌పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్‌ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్‌ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఐదు నుంచి ఏడుగురు దుండగులు కర్రలు, కారంపొడితో కళాశాల ఆవరణలోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. నీరజ్ ధాకడ్ సంస్కృత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘాతుకానికి తెగబడింది.. ఓల్డ్ స్టూడెంట్‌గా గుర్తించారు. స్కాలర్‌షిప్ విషయంలో గతంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని అన్నూ ఠాకూర్ అనే పాత విద్యార్థి ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Jangaon: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

దుండగులు ప్రొఫెసర్ ధాకడ్‌ను కర్రలతో కొట్టే ముందు కళ్లల్లోకి కారం పొడి పోసి అచేతనంగా పడి ఉన్న ప్రొఫెసర్‌పై దాడి చేశారు. అయితే చుట్టూ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రొఫెసర్ ధాకడ్ స్పృహ కోల్పోయే వరకు దాడి చేశారు. దాడి చేసినవారు పారిపోయిన తర్వాత మాత్రమే సహోద్యోగులు ప్రొఫెసర్ ధాకడ్‌కు సహాయం చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Kalki 2898AD: కల్కి నుంచి భైరవ ఆంథమ్ ప్రోమో వచ్చేసింది చూశారా..

ప్రొఫెసర్ తల, చేతులు, కాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. తీవ్ర గాయాలైనట్లు వైద్య నివేదికలు నిర్ధారించాయి. దాడి చేసిన వారిలో ఒకరైన కళాశాల పూర్వ విద్యార్థి అన్ను ఠాకూర్‌కు ప్రొఫెసర్‌కు గతంలో జరిగిన వివాదమే కారణంగా తేల్చారు. నెల క్రితం ధాకడ్‌కు సంబంధించిన స్టాంప్, లెటర్ హెడ్‌ను దుర్వినియోగం చేసినట్లుగా సమాచారం. ఇదే ఘర్షణకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రొఫెసర్‌ స్టేట్‌మెంట్ ప్రకారం.. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడపడుతున్నారు.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు