NTV Telugu Site icon

H3N2 Influenza: మధ్యప్రదేశ్‌లో మొద‌టి ఇన్ ఫ్లూయెంజా H3N2 కేసు.. యంత్రాంగం అప్రమత్తం

Madhyapradesh

Madhyapradesh

H3N2 Influenza: దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్రమ‌త్తం చేస్తూ ఇదివ‌ర‌కు లేఖ రాసింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈశాన్య భార‌త రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కూడా హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైర‌స్ వ్యాప్తి మొద‌లైంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ ర‌కం వేరియంట్ కు చెందిన మొద‌టి కేసు న‌మోదైంద‌ని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) విడుదల చేసిన అధికారిక బులెటిన్ పేర్కొంది. దీంతో వైర‌స్ పై ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

మధ్యప్రదేశ్‌లో H3N2 ఇన్ ఫ్లూయెంజా మొదటి కేసు కనుగొనబడింది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఒక యువకుడు వైరస్‌కు పాజిటివ్ పరీక్షించినట్లు గురువారం ఒక అధికారి తెలిపారు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల రోగికి బుధవారం H3N2 వైరస్ పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఎటువంటి లక్షణం లేదని భోపాల్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ తివారీ తెలిపారు. అతను దగ్గు, జలుబుతో ఫిర్యాదు చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతని నమూనాను ప్రయోగశాల పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని బైరాఘర్ ప్రాంతానికి చెందిన రోగిని ఏ ఆసుపత్రిలో చేర్చుకోలేదని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారని వారు తెలిపారు. మొత్తం నాలుగు రకాల ఇన్ ఫ్లూయెంజా వైరస్‌లు A,B,C,D రకాలు ఉన్నాయి. H3N2 అనేది ఇన్ ఫ్లూయెంజా A వైరస్ యొక్క ఉప-రకం.

Read Also: Cold Storage Collapse: కూలిన కోల్డ్ స్టోరేజీ పైకప్పు.. 8 మంది దుర్మరణం

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) నెట్ వ‌ర్క్ ద్వారా అసోంలో అభివృద్ధి చెందుతున్న సీజనల్ ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత అధికార వ‌ర్గాలు సైతం వెల్లడించాయి. కాగా, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, హెచ్3ఎన్ 2 అనేది మానవేతర ఇన్ ఫ్లూయెంజా వైరస్.. అయితే, ఇది మొదట మానవులలో 2011 లో కనుగొనబడింది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి శ్వాసకోశ సమస్యలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, నాడీ లేదా న్యూరో డెవలప్మెంటల్ పరిస్థితులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

Show comments