Site icon NTV Telugu

Madhu Yashki : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అరెస్ట్‌

Madhu Yashki

Madhu Yashki

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు స్పీడ్‌ పెంచారు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల వైఫల్యాలను ఎండగంటి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ‘తిరగబడదాం- తరిమికొడదాం’ నినాదంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు చార్మినార్‌ వద్ద ‘తోడుదొంగలు’ అనే పోస్టర్‌ను టీపీసీపీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ విడుదల చేసేందుకు వచ్చారు.

Also Read : Chandrababu Arrested Live Updates: చంద్రబాబుకు బెయిలా.. జైలా..?.. అనే దానిపై ఉత్కంఠ

అయితే.. చార్మినార్‌ వద్ద ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని నిర్భందించారు. దీంతో అక్కడ కాంగ్రెస్‌ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. మధు యాష్కీతో పాలు పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. గోడలకు పోస్టర్లు అతికించే సమయంలో అనుమతి లేదంటూ అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పార్టీ నేతలు అంటున్నారు. కాగా తోడు దొంగలు అనే పోస్టర్‌ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, డీసీసీ సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు..

Also Read : Deepthi Sunaina: ”దీప్తి సునయనకి రోడ్డు ప్రమాదం” ప్రచారం.. అసలు ఏం జరిగిందంటే?

Exit mobile version