Site icon NTV Telugu

Madhu Yashki Goud : బీఆర్ఎస్ ఆదేశాలతో డీసీపీ ఆడబిడ్డపై అబండాలు వేసారు

Madhuyaskhi Goud

Madhuyaskhi Goud

తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ ఎంపీల పాత్ర అత్యంత కీలకమైందన్నారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా రాజకీయ భవిష్యత్ గురించి మేము ఆలోచించలేదు.. రాష్ట్రం ఏర్పడితే చాలు అనుకున్నామన్నారు. కానీ ప్రవళిక లాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాకు భాధేస్తుందన్నారు మధు యాష్కీ. సూసైడ్ నోట్ లో ప్రేమ వ్యవహారం లేదని, కేటీఆర్ విర్రవీగి మాట్లాడుతున్నారన్నారు మధు యాష్కీ. ప్రవళిక ఆత్మహత్య గురించి కవిత ఎందుకు మాట్లాడడం లేదని మధు యాష్కీ ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ పై అబండాలు వేసారని, బీఆర్ఎస్ ఆదేశాలతో డీసీపీ ఆడబిడ్డ పై అబండాలు వేసారన్నారు మధు యాష్కీ. మ్యానిఫెస్టో తో కేసీఆర్ మరోసారి చెవి లో పువ్వులు పెట్టారని, 2014,18 లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు.. ఇప్పుడు కొత్త హామీలు ఇవ్వడం మరోసారి మోసం చేయడమేనని మధు యాష్కీ హెద్దేవ చేశారు.

Also Read : Health Tips : వంకాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ గ్యారంటీ లతో కేసీఆర్ కు వణుకు వచ్చింది. మా గ్యారెంటీ స్కీం లకు డబ్బులు ఎలా అని ప్రశ్నించిన కేటీఆర్.. ఇప్పుడు మీ బడ్జెట్ గురించి ఎందుకు చెప్పడం లేదు.. రాహుల్, ప్రియాంక గాంధీ ల బస్సు యాత్ర సక్సెస్ పై చర్చించాం.. టిక్కెట్ ల విషయం లో మాకు ఎలాంటి ఆందోళన లేదు. కేటీఆర్ సంస్కార హీనుడు.. కొన్ని సార్లు ఆశించిన వారికి టిక్కెట్ లు రాకపోవచ్చు.. పార్టీ గెలుపు కోసం పనిచేయాలి.. ఫస్ట్ లీస్ట్ ,సెకండ్ లీస్ట్ అనేది ఉండదు.. ఏ లీస్ట్ వచ్చినా..అభ్యర్దే..’ అని మధు యాష్కీ వ్యాఖ్యనించారు.

Also Read : Ponnala Laxmaiah Joined BRS: గులాబీ గూటికి చేరిన పొన్నాల లక్ష్మయ్య

Exit mobile version