NTV Telugu Site icon

Madhu Yashki : 9ఏళ్ల రాక్షస పాలన అంతానికి సమయం ఆసన్నమైంది

Madhuyashki

Madhuyashki

తొమ్మిదిన్నర సంవత్సరాల రాక్షస పాలనకు అంతం కావడానికి సమయం ఆసన్నమైందని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ అన్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించిన సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్ చౌరస్తాలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Also Read : Minister KTR : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు.. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన సుధీర్ రెడ్డినీ ఓడించడమే తమ లక్ష్యం అన్నారు. సుధీర్ రెడ్డి నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అధికార దాహంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, ప్రజలు దీనినీ గమనిస్తున్నారని ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఎల్బీనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని తెలియజేశారు. టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందర్నీ కలుపుకొని ముందుకు పోతానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Also Read : Priyanka Gandhi: ఈ ఘటనపై సిగ్గుపడుతున్నా.. ఐరాస తీర్మానంపై భారత్ ఓటేయకపోవడంపై ప్రియాంకా గాంధీ..