Site icon NTV Telugu

Madhu Yashki : ఒడిపోతా అనే భయంతో నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం

Madhu Yaskhi Goud

Madhu Yaskhi Goud

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీపై గాంధీభవన్‌లో పోస్టర్‌ వెలిశాయి. అయితే.. దీనిపి మధుయాష్కీ మాట్లాడుతూ.. గాంధీ భవన్‌లో నాపై వేసిన పోస్టర్ల వెనకాల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని, ఒడిపోతా అనే భయంతో నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి ఎంగిలి మెతుకులకు ఆశ పదే వాళ్ళు ఉంటారన్నారు. అలాంటి వారితోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, కోవర్టుల సంగతి తెలుస్తామని ఆయన హెచ్చరించారు.

Also Read : Rana Daggubati: జై భీమ్ వివాదం.. వారు కాంట్రవర్సీ చేశారు.. రానా సెన్సేషనల్ కామెంట్స్

టికెట్ ఆశించిన మిత్రులను కాపాడుకునే బాధ్యత నాది అని, పార్టీ ఆదేశాల మేరకే పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఎల్బీ నగర్ సెగ్మెంట్ టికెట్ కోసం మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్ వ్యతిరేకంగా ఏకంగా గాంధీభవన్ గోడలకే పోస్టర్లు దర్శనమివ్వడం కాంగ్రెస్ పార్టీలో చర్చమొదలైంది. ఇదిలా ఉంటే.. గాంధీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లతో తనకు సంబంధం లేదని ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ లో చేసిన సర్వేలో తాను గెలుస్తానని తెలిసిందని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని, టిక్కెట్ కూడా తనకే వస్తుందన్నారు. తన గెలుపు కోసం నియోజకవర్గంలో పని చేసుకుంటున్నట్లు చెప్పారు.

Also Read : Roshini App: “కంటిశుక్లాల”ను గుర్తించే యాప్.. డెవలప్ చేసిన టీనేజర్..

Exit mobile version