NTV Telugu Site icon

Madhu Yashki : సుప్రీం కోర్టు తీర్పుపై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండు

Madhu Yashki

Madhu Yashki

సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం అని ఆయన ప్రశ్నించారు. పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారని, గతంలోనే విద్యుత్ కొనుగోలు లో అవినీతి జరిగిందని చెప్పిన అని మధు యాష్కీ గుర్తు చేశారు. 138 కోట్లు కమిషన్ కేటీఆర్,హరీష్ రావులు తీసుకున్నారని చెప్పారన్నారు. తెలంగాణ రాకముందు మీ ఆస్తుల ఎంత అని, వచ్చాక ఆస్తులు ఎంత అని ఆయన అన్నారు. అన్ని బయటకు వచ్చి జైలుకు పోతారన్నారు. అభివృద్ధి పేరు పైన ,ప్రాజెక్టుల రి డిజైన్ పేరు మీద వేలాది కోట్లు దోచుకున్నారని, విచారణ ను అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. సుప్రీం కోర్టు కేసీఆర్ అవినీతిని అడ్డుకోలేదన్నారు మధు యాష్కీ. కొత్త జడ్జి వచ్చి అవినీతిని బయటకు తీస్తాడని, గ్రీన్ ఛాలెంజ్ అని హడావిడి చేసే చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండన్నారు. వాళ్ళ ఆవిడా పేరుమీద నర్సరీ పెట్టి కోట్ల రూపాలను దోచుకున్నారని, దానిపై కూడా విచారణ చేపట్టాలన్నారు మధు యాష్కీ.