టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకంతా సమంతపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఏ విషయంలోనైనా సూటిగా స్పందించే నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.
Also Read : Pawan Kalyan : పవన్ కల్యాణ్ నిజ స్వభావం బయటపెట్టిన జయసుధ..!
మాధవీలత ఓ వీడియోలో మాట్లాడుతూ..‘సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకు ఇంత బాధ? నాకర్ధం కావడం లేదు.. ఆమె ఎవరిదో సంసారం కూల్చింది? అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు, అలాంటి వ్యాఖ్యలు చేసేవారే ముందుగా ఎన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో ప్రశ్నించుకోవాలి. మరొకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు.. విడాకులు ఇవ్వకుండా వ్యవహారాలు నడిపిస్తున్న వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నాకు నవ్వొస్తోంది. నిజానికి పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి, రుణాలు తీరిపోతే విడిపోతారు. ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? ఆ విషయంలో సంతోషించండి. మీరేమీ పతివ్రతలు కాదు కదా.. ఇలా కామెంట్లు చేసేవారి గురించి నాకు బాగా తెలుసు’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెట్టింట విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది మాధవీలత వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు ఇలా వ్యక్తిగత విషయంపై వీడియోలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, సమంత రెండో పెళ్లి పై జరుగుతున్న చర్చలకు మాధవీలత ఇచ్చిన ఈ కౌంటర్ పెద్ద డిబేట్‌ను సృష్టించింది.
