NTV Telugu Site icon

MAD : ఓటీటీ లోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ…

Whatsapp Image 2023 10 27 At 10.25.35 Am

Whatsapp Image 2023 10 27 At 10.25.35 Am

చిన్న సినిమా గా విడుదలయి అద్భుత విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్‌ మూవీ ఒకటి. ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా ఎంతో పాజిటివ్  గా వచ్చాయి.  మ్యాడ్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్‌ బావ మరిది అయిన నార్నే నితిన్‌ మ్యాడ్‌ మూవీ తోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతనితో పాటు సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌ ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. తన కామెడీతో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. వీరితో పాటు మూడో హీరోగా రామ్‌ నితిన్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన మ్యాడ్ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్‌ మొదటి వారంలో మ్యాడ్‌ సినిమా ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

మ్యాడ్ మూవీ కు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్‌ గౌడ్‌, విష్ణు, ఆటోని మరియు శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రముఖ దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీలో ఓ క్యామియో రోల్‌లో మెరవడం గమనార్హం… సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ స్‌ బ్యానర్లపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయి సౌజన్య మరియు హారిక సూర్యదేవర సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మించారు. భీమ్స్‌ సిసిరిలియో అందించిన పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. ఈ మూవీ కథ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం ఇంజినీరింగ్‌ కాలేజీ చుట్టే తిరుగుతోంది. మనోజ్ (రామ్ నితిన్‌), అశోక్ (నార్నే నితిన్‌), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్‌ శోభన్‌) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. వారి జీవితాల్లోకి జెన్నీ(అనంతిక), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి),మరియు , రాధ (గోపిక ఉద్యాన్‌) వస్తారు. మరి ఈ ముగ్గురి వల్ల అశోక్‌, మనోజ్‌, డీడీ జీవితాలు ఎలా మారిపోయాయి.. అన్నది ఎంతో ఫన్నీ గా తెరకెక్కించారు డైరెక్టర్‌. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆడియెన్స్‌ తెగ ఎంజాయ్ చేసారు.