NTV Telugu Site icon

Kalyan Shankar: కక్కుర్తి, స్వార్ధం.. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మ్యూజిక్ డైరెక్టర్‌లపై డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Mad Square

Mad Square

డైరెక్టర్‌ కల్యాణ్‌ శంకర్‌ తొలి చిత్రం ‘మ్యాడ్‌’. తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ వచ్చింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మ్యాడ్‌ స్క్వేర్‌ మూవీ మూడు రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. చిన్న హీరోలు నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ చేసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. తాజాగా మీడియా సమావేశంలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్‌లను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని డైరెక్టర్‌ తెలిపారు.

Also Read: RR vs CSK: నేను తెలుగు సినిమాలు చూస్తా.. ‘పుష్ప’ సూపర్: శ్రీలంక బౌలర్‌

మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించగా.. ఎస్ఎస్ తమన్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. సినిమాలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్‌లను పెట్టడానికి ఏదైనా కారణం ఉందా? అని ఓ రిపోర్టర్ అడగగా.. కొంచెం స్వార్ధంగా ఆలోచించి ఇద్దరిని తీసుకున్నా అని డైరెక్టర్‌ కల్యాణ్‌ శంకర్‌ తెలిపారు. ‘డీజే టిల్లు తమన్ గారు చేశారు. టిల్లు 2లో మాస్ బీట్ కోసం తమన్ కాకుండా భీమ్స్‌ అయితే బాగుంటుందని డిస్కషన్ వచ్చింది. అదే మాదిరి మ్యాడ్‌ స్క్వేర్‌లో గోవా పార్ట్ కోసం సౌండ్ కొత్తదనం ఉండాలని తమన్‌ను తీసుకున్నాం. అంతేకాదు కొంచెం కక్కుర్తి, స్వార్ధంగా ఆలోచించాం. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్, డాకుమహారాజ్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్ హిట్. రెండు మిక్స్ చేసి చేస్తే బాగుంటుందని ఇద్దరిని పెట్టాం’ అని డైరెక్టర్‌ చెప్పుకొచ్చారు.