Site icon NTV Telugu

MacKenzie Scott: జెఫ్ బెజోస్ మాజీ భార్య మళ్లీ అదే దారి.. రెండో భర్త నుంచి కూడా..

Jeff Bezos Ex Wife

Jeff Bezos Ex Wife

MacKenzie Scott: అమెజాన్ ఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్‌ బెజోస్ భార్య మెకంజీ స్కాట్ గతంలో ఓ సైన్స్ టీచర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019లో బెజోస్‌ నుంచి విడిపోయిన ఆమె టీచర్‌ అయిన డాన్‌ జెవెట్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు రెండో భర్త డాన్‌ జెవెట్‌ నుంచి కూడా ఆమె విడాకులు కోరుతున్నారు. సోమవారం నాడు వాషింగ్టన్ రాష్ట్రంలోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో స్కాట్.. “తమ వివాహాన్ని రద్దు చేయమని తాము కోర్టును కోరుతున్నాము.” అని ఆమె కోర్టును కోరింది.

మెకంజీ స్కాట్‌ ఓ ప్రైవేటు సంస్థలో జెఫ్‌ బెజోస్‌కు అసిస్టెంట్‌గా పని చేస్తూ ఆయనతో ప్రేమలో పడ్డారు. 1993లో వీళ్లు దంపతులయ్యారు. తర్వాత బెజోస్‌ స్థాపించిన అమెజాన్‌ సంస్థలో మెకంజీ కీలక బాధ్యతలను చేపట్టారు. ఈ జంటకు ముగ్గురు మగపిల్లలు. చైనాకు చెందిన ఓ అమ్మాయినీ దత్తత తీసుకొన్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ దంపతులు 2019లో విడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు మెకంజీ ఓ హైస్కూల్‌ కెమిస్ట్రీ టీచర్‌ డేన్‌ జెవెట్‌ను వివాహమాడారు. అమెజాన్‌ సంస్థలో ప్రస్తుతం ఈమెకు 4 శాతం వాటా ఉంది.

Durgam Cheruvu Cable Bridge: దొరకని స్వప్న ఆచూకీ.. పోలీసులపై స్వప్న సిస్టర్‌ సీరియస్‌..

విడాకుల త‌ర్వాత భ‌ర‌ణం రూపంలో జెఫ్ బెజోస్ నుంచి భారీ మొత్తం అందుకున్న మెకంజీ స్కాట్‌.. అందులో స‌గ భాగాన్ని వివిధ చారిటీల‌కు విరాళాలుగా ఇస్తాన‌ని ప్రక‌టించింది. 2019లో ఈ మేర‌కు గివింగ్ ప్లెడ్జ్‌లో సంత‌కం కూడా చేసింది. మెకంజీ స్కాట్ పిల్లలు వెళ్లే లేక్‌సైడ్ స్కూల్లోనే డాన్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్పడింది. అక్కడ డాన్ కెమెస్ట్రీ టీచ‌ర్‌గా ప‌ని చేసేవాడు. 2019లో జెఫ్ బెజోస్‌తో త‌న 25 ఏళ్ల వైవాహిక బంధానికి మెకంజీ స్కాట్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ సంద‌ర్భంగా బెజోస్ ఇచ్చిన మొత్తంతోనే ఆమె ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచేలా చేసింది. ప్రస్తుతం తన రెండో భర్త నుంచి కూడా మెకంజీ స్కాట్ విడాకులు కోరుతున్నారు.

Exit mobile version