ఈ ఎన్నికల్లో.. టీడీపీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ (గురువారం) ఎమ్మిగనూరు పట్టణంలోని 25వ వార్డు, గాంధీనగర్ నందు బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీపై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్ట పెట్టినందుకు ప్రజలు పశ్చాతాపం పడుతున్నారని మాచాని సోమనాథ్ తెలిపారు.
Read Also: PM Modi Visit to Telangana: రేపు రాష్ట్రానికి ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్‌షో
అయితే, ప్రచారంలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకు వస్తున్నారని ఎమ్మిగనూర్ టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. జగన్ సంక్షేమ పథకాల పేరుతో బటన్ ను నొక్కడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. గాంధీనగర్ లో లాండ్రీ షాపు నందు డాక్టర్ మాచాని సోమనాథ్ బట్టలను ఇస్త్రీ చేశారు. బీసీ డిక్లరేషన్ లో ఆదరణ పథకం కింద చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించుటకు చంద్రబాబు భరోసా కల్పించారని రజకునికి ఆయన వివరించారు. జగన్ రెడ్డి అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.57,188 కోట్ల రూపాయల భారం మోపారు అని డాక్టర్ మాచాని సోమనాథ్ ఆవేదన చెందారు.
Read Also: Ravikula Raghurama: రవికుల రఘురామ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి..
కాగా, 73 ఏళ్ల చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రులు 7000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే చంద్రబాబు ఒక్కరే 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత దక్కిందని డాక్టర్ మాచాని సోమనాథ్ అన్నారు. చంద్రబాబు “విజన్” ఉన్న నాయకుడు.. జగన్ “రీజన్” లేని నాయకుడు.. రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆయన మండిపడ్డారు. రాక్షస పాలనను, రాచరిక పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కదిరికోట ఆదెన్న, కేఎండి అబ్దుల్ జబ్బార్, చేనేత విభాగం నాయకులు లక్ష్మీరెడ్డి, కుర్ని దేవదాయ సంఘం సెక్రెటరీ సుధాకర్, కామర్తి గంగాధర్, ధణ, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, కంపాడు చిన్న రంగన్న, వన్నెల మోషే, ఆఫ్గాన్ వలి భాష తదితరులు ఉన్నారు.