ఈ ఏడాది అద్భుత విజయం సాధించింది సినిమాలలో ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ ఒకటి.నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.బ్లాక్ మ్యాజిక్, సస్పెన్స్, ట్విస్టులతో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం లో సత్యం రాజేశ్ ప్రధాన పాత్ర పోషించారు.ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చిన మాఊరి పొలిమేర సినిమాకు ‘మా ఊరి పొలిమేర-2’ ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కింది. ఊహించని ట్విస్ట్ లతో ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను అందించింది.ఇదిలా ఉంటే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ ఇటీవలే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాగా అక్కడ కూడా అదరగొడుతుంది.మా ఊరి పొలిమేర-2 సినిమా డిసెంబర్ 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు అంతకంటే 24 గంటలు ముందుగానే అంటే డిసెంబర్ 7 న అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ఆహా ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకెళ్తుంది.పొలిమేర 2 మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
ఓటీటీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన పొలిమేర-2 అంటూ ఆహా ట్వీట్ చేసింది. 100 మిలియన్ నిమిషాలను ఈ మూవీ దాటినట్టు పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.మా ఊరి పొలిమేర-2 చిత్రంలో కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను మరియు రవివర్మ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు గ్యానీ సంగీతం అందించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు.కొమురయ్య (సత్యం రాజేశ్)కు, కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి మరియు జాస్తిపల్లి పొలిమేరలోని గుడికి సంబంధం ఏంటన్న విషయం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూవీ చివరి లో పొలిమేర 3 రాబోతున్నట్లు దర్శకుడు లీడ్ ఇస్తాడు.
Pooja Prarambham!☠️
Thrilling Sambhavami😨#Polimera2 Streaming Now▶️https://t.co/EjVZhevzG5 @Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 #ahaGold #Polimera2 pic.twitter.com/VdxmiVx5sG— ahavideoin (@ahavideoIN) December 7, 2023