టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఇక ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును రెండవ పెళ్లి చేసుకున్న సామ్ టాలీవుడ్ తెరపై కనిపించేందుకు రెడీ అయింది. లేడి డైరెక్టర్ నందిరెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది సమంత. తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ విడుదలైంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో మాస్ యాక్షన్ కూడా గట్టిగానే దట్టించారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టర్ల ప్రెజెంటేషన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.ఇక సమంత చేసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. యాంకర్ శ్రీముఖి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నందిని రెడ్డి – సమంత కాంబోలో వచ్చిన బేబీ సూపర్ హిట్ సంధించింది. ఇప్పుడు రాబోతున్న మా ఇంటి బంగారం కూడా హిట్ కళ పుష్కలంగా కనిపిస్తోంది. టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘మా ఇంటి బంగారం’ – మాస్ ప్రేక్షకులకు భావోద్వేగాలతో పాటు విజిల్స్ పండించే సినిమా అని టీజర్‌తోనే క్లారిటీ వచ్చేసింది!