NTV Telugu Site icon

Poisonous Food: చికెన్‎లో చనిపోయిన ఎలుక.. లూథియానాలో దాబా యజమానిపై కేసు

Chicken Curry

Chicken Curry

Poisonous Food: పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దాబాలో ఆహారంలో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పుడు దాబా యజమానిపై కేసు నమోదైంది. దీనిపై దాబా యజమాని స్పందిస్తూ.. ఈ కస్టమర్లకు డిస్కౌంట్ కావాలని, డిస్కౌంట్ ఇవ్వనప్పుడు బలవంతంగా అలాంటి వీడియో తీశారని దాబా యాజమాన్యం ఓ వీడియోను విడుదల చేసింది.

కథనం ప్రకారం.. దాబాలో తినేందుకు వెళ్లిన ఓ కుటుంబం చికెన్ కర్రీ ఆర్డర్ చేసింది. ఆహారం ఎదురుగా రాగానే చికెన్ కూరలోనే చనిపోయిన ఎలుక కనిపించింది. ఈ వీడియోను కుటుంబ సభ్యులు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితుడి పేరు వివేక్ కుమార్. వివేక్ ప్రేమ్ నగర్ ఫీల్డ్ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివేక్ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం తన కుటుంబంతో కలిసి విశ్వకర్మ చౌక్‌లోని ప్రకాష్ ధాబాలో భోజనం చేసేందుకు వెళ్లినట్లు వివేక్ తెలిపాడు. ఇంతలో అతను చికెన్ కర్రీని కూడా ఆర్డర్ చేశాడు. అందులో చనిపోయిన ఎలుక బయటకు వచ్చింది. దీనిపై దాబా సిబ్బందికి ఫిర్యాదు చేయగా, తనను దుర్భాషలాడారని బెదిరించారని వివేక్ చెప్పారు.

Read Also:IND vs WI: రింకూ సింగ్‌ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి?.. బీసీసీఐని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్!

దాన్ని వివేక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతను కొంత ఆహారం కూడా తిన్నాడు, దాని కారణంగా చాలా మంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇప్పుడు పోలీసులు దాబా యజమానిపై పాడైన ఆహారాన్ని విక్రయించే చట్టాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కుట్రపూరితంగా ఈ వీడియో తీశారని, తారుమారు చేశారని దాబా యజమాని చెబుతున్నారు.

Read Also:Anil Kumar Yadav: ఆస్తులపై వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణానికి సిద్ధం