లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేశారు. ఆ తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ ఆటగాళ్లు.. టార్గెట్ రీచ్ కాలేకపోయారు.
Also Read : Killers of the Flower Moon: లియోనార్డో – మార్టిన్ అంత ‘పెద్దది’ చేశారా!?
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి మొదటిలో ఎదురుదెబ్బ తగిలింది. మార్క్ వుడ్ తన తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా ను 12 పరుగుల వద్ద పెవిలియన్ పంపించేశాడు. అంతేకాకుండా.. మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్‌తో వెనుదిరిగాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్(4)ను ఐట్ చేసి మూడో వికెట్ తీశాడు. ప్రమాదకరమైన రిలే రస్సో(30), పావెల్(1)ల వికెట్లను బిష్ణోయ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) ఒంటరి పోరాటం చేశాడు. అర్ధ శతకం బాదిన అతడికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. అతను ఔటయ్యాక ఆ జట్టు ఓటమి ఖరారైంది. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడడంతో పరుగుల మధ్య తేడా తగ్గింది.
Also Read : Roti: పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గ్యాస్‌పై కాల్చకండి..