NTV Telugu Site icon

LSG vs GT: కేఎల్ రాహుల్‌ ‘స్పేర్‌ టైర్‌’ లాంటోడు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kl Rahul Lsg

Kl Rahul Lsg

Navjot Singh Sidhu Praises KL Rahul: టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌ను వాహన ‘స్పేర్‌ టైర్‌’తో పోల్చారు. అత్యవసర పరిస్థితుల్లో అతడిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చన్నారు. రాహుల్‌ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని సిద్ధూ పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో నవ్‌జ్యోత్ సిద్ధూ మాట్లాడుతూ… ‘కేఎల్ రాహుల్ ఎన్నో ప్రశంసలకు అర్హుడు. రాహుల్ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. అతడు వికెట్ కీపర్‌గా లేదా ఓపెనర్‌గా కూడా ఆడతాడు. జట్టులోని ఏ పాత్రనైనా పోషించగడు. జీప్‌ వెనుక ఎప్పుడూ ఒక టైర్‌ ఉంటుంది. అదే స్పేర్‌ టైర్‌. అత్యవసర పరిస్థితి లేదా పంక్చర్ అయినపుడు ఆ స్పేర్ టైర్‌ను వాడుకుంటాం. కేఎల్ రాహుల్‌ ఆ స్పేర్ టైర్‌ లాంటోడు. అందరికీ ఆ సామర్థ్యం ఉండదు’ అని అన్నారు.

Also Read: Allu Arjun: ఆ లెటర్‌ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్‌

కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఎల్‌ఎస్‌జీకి నాయకత్వం వహిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ 28 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఎల్‌ఎస్‌జీ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈరోజు లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో తలపడనుంది. మొదటి రెండు సీజన్లలో రాహుల్ నాయత్వంలో ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

 

Show comments