NTV Telugu Site icon

LSG vs CSK: సొంత ఇలాకాలో లక్నోను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిస్తుందా..

1

1

ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్‌ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్‌ లో., కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై నేటి మ్యాచ్ లో ఓడిపోతే లక్నో సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్‌ లకు చేరుకునే అవకాశాలను క్లిష్టతరం చేసుకుంటుంది.

Also read: Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..

ఇక మరోవైపు ఈ సీజన్‌లో సీఎస్‌కే మంచి ఫామ్‌ లో ఉంది. చివరి సీజన్ ఛాంపియన్‌ లు ఆరు గేమ్‌ లలో నాలుగు విజయాలతో చాలా పటిస్త స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు 6 గేమ్‌ లలో ఆడి.. 4 మ్యాచ్ లలో విజయం సాధించి 2 మ్యాచ్ లలో ఓడింది. ప్రస్తుతం పాంట్స్ పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మూడు ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. ఇందులో చెన్నై 1 గెలవగా, లక్నో 1 గెలిచింది. 1 మ్యాచ్ ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. లక్నో ఇప్పటివరకు చెన్నై పై అత్యధిక స్కోరు 211, అలాగే లక్నో సూపర్‌జెయింట్స్ పై చెన్నై అత్యధిక స్కోరు 217.

Also read:Off The Record: నంద్యాలలో కూటమి పార్టీల కుమ్ములాట

ఇక నేటి మ్యాచ్ లో టీమ్స్ విషయానికి వస్తే ఈ విధంగా అంచనా వేయవచ్చు. ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ XI జట్టు చూస్తే .. క్వింటన్ డి కాక్, KL రాహుల్ (c & wk), అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ గా ఉండొచ్చు.

ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ XI జట్టును చూస్తే.. రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, శివమ్ దూబే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, MS ధోని (WK), సమీర్ రిజ్వీ, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ, దీపక్ చాహర్ గా ఉండొచ్చు.