NTV Telugu Site icon

IPL 2025: రోహిత్‌ శర్మ కోసం రూ. 50 కోట్లు.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే..!

Lsg Goyenka

Lsg Goyenka

ఐపీఎల్ 2025 కోసం ఈ సంవత్సరం మెగా వేలం ఉండవచ్చు. ప్రస్తుతం వేలానికి సంబంధించిన నిబంధనల గురించి బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌లో మెగా వేలం జరిగినప్పుడు ఏ జట్టు అయినా పూర్తిగా రిటైన్ చేయాల్సిందే. కానీ.. గతసారి మెగా వేలంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి లభించింది. అయితే ఈసారి ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సింది ఇంకా ఖరారు కాలేదు. రైట్ టు మ్యాచ్ కార్డ్‌తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను జట్టు అట్టిపెట్టుకోగలదని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అందరి దృష్టి ముంబై ఇండియన్స్‌పైనే ఉంది. తమ వద్ద చాలా మంది ఆటగాళ్లు రిటైన్ కావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్.. రోహిత్ శర్మ వంటి చాలా మంది స్టార్లు ఉన్నారు. ఈ క్రమంలో ఫ్రాంచైజీ రోహిత్‌ను రిటైన్ చేస్తుందా లేదా అనే సమాచారం ఇంకా తెలియదు.

Pilli Subhash Chandra Bose: వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్‌తోనే!

ముంబై ఇండియన్స్‌తో హిట్‌మ్యాన్ వివాదం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్‌గా తొలగించింది. ఈ క్రమంలో.. హార్దిక్ పాండ్యాను జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. దీంతో.. రోహిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్రంగా విమర్శించారు. అయితే.. రోహిత్ బ్రాండ్ వాల్యూను పరిగణనలోకి తీసుకుంటే, అతను వేలంలోకి వస్తే.. కొనుగోలు చేసేందుకు చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) జట్లలో ఆరు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను (మ్యాచ్ హక్కుతో సహా) ఉంచుకోవడానికి అనుమతించకపోవచ్చు. ఈ క్రమంలో.. రోహిత్ తదుపరి సీజన్‌లో కొత్త జట్టుకు ఆడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. కాగా.. లక్నో జట్టు ఓనర్ గోయెంకా ఆ పుకార్లను ఖండించారు. స్పోర్ట్స్ టాక్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ వేలానికి వస్తున్నాడో లేదో ఎవరికీ తెలియదు. అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ విడుదల చేస్తుందా అనేది కూడా తెలియదు. ఒకవేళ వేలంలోకి వస్తే.. ఒక్క ఆటగాడి కోసం 50 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. మరీ మిగతా ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తాం’ అని పేర్కొన్నారు. తమ జట్టులో అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్ కావాలి అనే కోరిక ప్రాంఛైజీకి ఉంటుందని చెప్పారు. అలాగే.. ఆ కోరిక అన్ని ఫ్రాంచైజీలకు ఉంటుంది.. అలాగని ప్రతిఒక్కరినీ తీసుకోవడమూ కుదరదని గోయెంకా వెల్లడించారు.