లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన లక్నో నెమ్మదిగా ఆడుతోంది. కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. లక్నో సూపర్ జెయింట్స్ 19 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా తన మొదటి ఓవర్ చివరి బంతిని రాహుల్ ప్యాడ్‌లలోకి బౌలింగ్ చేశాడు.
Also Read : Mrunal Thakur : నేను అలా చేయడం అమ్మనాన్నకు అస్సలు ఇష్టం లేదు
దీంతో దానిని డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లో నేరుగా అక్షర్ పటేల్ చేతుల్లోకి విసిరాడు. దీంతో.. రాహుల్ 8 పరుగులకు వెనుదిరిగాడు. ఆతరువాత.. 79 పరుగుల భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ బ్రేక్ చేశాడు. దీపక్ హుడా 11వ ఓవర్ చివరి బంతికి 17 పరుగులకే ఔటయ్యాడు. 38 బంతుల్లోనే 73 పరుగులతో విరుచుకుపడిన కైల్ మేయర్స్ ఇన్నింగ్స్‌కు అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
Also Read : KKR vs PBKS : కోల్‌కతాపై 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం