Site icon NTV Telugu

LSG vs RR : ముగిసిన లక్నో బ్యాటింగ్‌.. రాజస్థాన్‌ లక్ష్యం 155.

Lsg

Lsg

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రసవత్తరమైన మ్యాచ్‌ జరుగుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 26వ మ్యాచ్‌ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతోంది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. లక్నో నుంచి ఓపెనింగ్‌కు దిగిన కైల్‌ మేయర్స్‌ , కేఎల్‌ రాహుల్‌ నెమ్మదిగా ఆట ప్రారంభించిన.. 39 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌ను సమర్పించుకున్నాడు.

Also Read : Talasani Srinivas Yadav : అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

బౌల్ట్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో రెండో వికెట్‌ను కోల్పోయింది. అయితే.. 14వ ఓవ‌ర్‌ను అశ్విన్ వేయగా.. రెండో బంతికి దీప‌క్ హుడా షాట్ ఆడి షిమ్రాన్ హెట్మెయర్ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఐదో బంతికి కైల్ మేయర్స్ ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఒకే ఓవర్లో అశ్విన్‌ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది లక్నో. కైల్‌ మేయర్స్‌ 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్‌రాహుల్‌ 39, పూరన్‌ 29 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో అశ్విన్‌ రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్‌, సందీప్‌ శర్మ, హోల్డర్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

Also Read : MLA Ramesh Babu : చవట దద్దమ్మలార రమేష్ బాబు బెదరడు.. పుట్టుడే ఎమ్మెల్యే కొడుకుగా పుట్టిన

Exit mobile version