లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ 19 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 38 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. నికోలస్ పూరన్ 36 పరుగులతో రాణించాడు. చివర్లో ఆయుష్ బదోని ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియాలు చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Also Read : Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మొదటి నుంచి నెమ్మదిగా ఆట ప్రారంభించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 8పరుగులకు వెనుదిరిగాడు. అయితే.. మరో ఓపెనర్ కైలీ మేయర్ ఢిల్లీ బౌలర్లపై సిక్సర్లతో చెలరేగి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఆ తరువాత 73 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా 17 పరుగులతో రెండో వికెట్‌కు 79 రన్స్ జోడించాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ 12 పరుగులకే ఔట్ అయ్యాడు. పూరన్(36), బదొని(18) సిక్స్‌లతో చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.
Also Read : Sabitha Indra Reddy : కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుపోవాలి