NTV Telugu Site icon

LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

Gas

Gas

LPG Gas Cylinder: ఆగస్టు ఫస్ట్ రోజునే గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను చమురు భారీగా తగ్గించాయి. జూలైలో ధరలు కాస్త పెరిగినా.. ఆ తర్వాత సిలిండర్ ధర పతనం కనిపిస్తోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1 ఉదయం వాణిజ్య సిలిండర్ల (ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర) ధరను రూ.100 తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌కు ఇప్పుడు రూ.1680 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గతంలో రూ.1780 చెల్లించాల్సి వచ్చేది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.

Read Also:Off The Record: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు.. పగవాడికి కూడా రాకూడని కష్టం..?

ఆగస్టు 1 నుంచి కొత్త రేటు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొత్త రేటు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో మునుపటిలా రూ.1103 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.1780 నుంచి రూ.1680కి తగ్గింది. కోల్‌కతాలో గతంలో రూ.1895.50 ఉండగా, ఇప్పుడు రూ.1802.50 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ముంబైలో గతంలో రూ.1733.50కి లభించగా, ఇప్పుడు రూ.1640.50కి అందుబాటులోకి రానుంది. చెన్నైలో ధర రూ.1945.00 నుంచి రూ.1852.50కి తగ్గింది.

Read Also:Delhi Services Bill: మంగళవారం లోక్‌సభలో ఢిల్లీ సర్వీసెస్‌ బిల్.. గతంలో ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం

27 రోజుల తర్వాత తగ్గిన సిలిండర్ ధర
27 రోజుల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. అంతకుముందు జూలై 4న కంపెనీలు సిలిండర్‌పై రూ.7 చొప్పున పెంచాయి. జులైకి ముందు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సిలిండర్ల ధరలు తగ్గాయి. మార్చి 1, 2023న.. సిలిండర్ ధర రూ.2119.50. ఆ తర్వాత ఏప్రిల్‌లో రూ.2028కి తగ్గగా, మేలో రూ.1856.50కి, జూన్ 1న రూ.1773కి చేరింది. అయితే దీని తర్వాత జూలైలో రూ.7 పెరగడంతో ఢిల్లీలో సిలిండర్ రూ.1780కి చేరింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 14.2 కేజీల సిలిండర్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సిలిండర్ ధర దాదాపు రూ. 1155 వద్ద ఉంది. అలాగే ఏపీలో సిలిండర్ ధర దాదాపు ఇదే స్థాయిలో రూ. 1161 వద్ద కొనసాగుతోంది.

Read Also:Haryana: హర్యానాలోని నుహ్లో హింసాకాండ.. 144 సెక్షన్ అమలు, ఇంటర్నెట్ బంద్

మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధర
ఢిల్లీ —- రూ 1680
కోల్‌కతా —- రూ 1802.50
ముంబై —- రూ 1640.50
చెన్నై —- రూ 1852.50

Show comments