Site icon NTV Telugu

Lover Entry In Marriage: సినిమా రేంజ్‌లో పెళ్లికి హాజరైన ప్రియుడు.. చివరకు..?

Image (8)

Image (8)

Lover Entry In Marriage: నెల్లూరు నగరంలో ఓ ప్రేమ వ్యవహారం ఒక వివాహాన్ని మధ్యలోనే ఆపేసింది. సినిమాను తలపించే ఈ ఘటన జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ ఫంక్షన్‌ను ప్రియుడు అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా లేగుంటపాడు ప్రాంతానికి చెందిన నందవర్ధన్ అనే యువకుడితో ప్రేమ సంబంధం కొనసాగించింది. అయితే ఈ విషయం ఇంట్లో తెలిసి, కుటుంబ సభ్యులు మందలించడంతో యువతి నందవర్ధన్‌ తో సంబంధాన్ని తెంచుకుంది. కుటుంబ పెద్దల ఒప్పందంతో ఆమెకు మరో సంబంధం కుదిరింది.

Read Also:Body Found In Drum: డ్రమ్‌లో కుళ్ళిపోయిన మృతదేహం.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

ఈ నేపథ్యంలో హల్దీ ఫంక్షన్ జరుగుతుండగా.. నందవర్ధన్ తన స్నేహితులతో కలిసి కళ్యాణ మండపానికి వచ్చి అక్కడ రచ్చ చేశాడు. పెళ్లి వేదిక వద్ద తన జీవితం నాశనం చేసిందంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో వధువు కుటుంబంలో కలవరం మొదలైంది. పరిస్థితి చర్చకు దారి తీసి చివరికి పెళ్లి నిలిపివేశారు. ఈ ఘటనపై బాధిత యువతి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also:WI vs AUS: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆసీస్ టెస్ట్ మ్యాచ్.. స్వల్ప లీడ్‌లో విండీస్

Exit mobile version