Site icon NTV Telugu

Love Marriage: ఆయనకేమో 60, ఆమెకు 28.. కట్ చేస్తే?

Love Marriage

Love Marriage

Love Marriage: ప్రేమకు వయసుతో పనిలేదని అంటుంటారు.. కానీ ఇక్కడ ఒక అడుగు ముందుకేసి మతం, సమాజం గీసిన గీతలను కూడా చెరిపేస్తూ ఒక జంట ఒక్కటయ్యారు. బీహార్‌ లోని ఔరాయ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ యజమాని రాకేష్ షా, అదే పాఠశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు షైస్తా పర్వీన్‌తో ప్రేమలో పడ్డారు. అంతే.. సమాజం గురించి ఆలోచించకుండా.. వీరిద్దరూ ఊరు విడిచి వెళ్లి నేపాల్‌లోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్‌లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు

రాకేష్ షా ఔరాయ్‌లో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు. షైస్తా పర్వీన్ అక్కడ టీచర్‌గా చేరడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కలిసి పనిచేస్తున్న క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఫిబ్రవరి 18న వీరిద్దరూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. తీరా చూస్తే.. సరిహద్దు దాటి నేపాల్ చేరుకున్న ఈ జంట.. అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.

ఈ వివాహంపై 28 ఏళ్ల షైస్తా పర్వీన్ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె ఎంతో సంతోషంగా కనిపిస్తూ.. “నేను నా ఇష్టపూర్వకమే ఈ పెళ్లి చేసుకున్నాను. నా కొత్త జీవితంతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. దయచేసి నా భర్త రాకేష్ కుటుంబాన్ని వేధించకండి” అని విజ్ఞప్తి చేసింది. మరోవైపు షైస్తా సోదరుడు ఔరాయ్ పోలీస్ స్టేషన్‌లో రాకేష్ షాపై ఫిర్యాదు చేశారు. నలుగురు పిల్లల తండ్రి అయిన రాకేష్.. పెళ్లి, మత మార్పిడి ఉద్దేశంతోనే తన సోదరిని కిడ్నాప్ చేశాడని ఆయన ఆరోపించారు. రాకేష్ భార్య, కుమార్తెతో సహా మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

Donald Trump: “ఆమెను వెంటనే తొలగించండి”.. లేదంటే “భారీ పరిణామాలను” ఎదుర్కుంటారు!

ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం స్కూల్, రాకేష్ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు గ్రామంలో గస్తీని పెంచారు. వైరల్ అవుతున్న వీడియో నిజమైనదేనా కాదా అని విచారణ జరుపుతున్నామని.. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version