Site icon NTV Telugu

West Bengal: ప్రేమ విషయంలో గొడవ.. ప్రియుడి పెదాలు కోసిన ప్రియురాలి పేరెంట్స్

Lips

Lips

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బీర్‌భూమ్ జిల్లా బోల్‌పూర్‌లో ప్రియుడి పెదాలను కోసారు ప్రియురాలు కుటుంబ సభ్యులు. అంతకుముందు ప్రియురాలు, ప్రియుడి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని ఇంటికి పిలిపించి కత్తితో పెదవులను కోశారు.

Bro-RRR: బ్రో రిలీజ్ రోజునే ట్రెండింగ్లో ఆర్ఆర్ఆర్.. ఎందుకో తెలుసా?

వివరాల్లోకి వెళ్తే.. బీర్భూమ్ జిల్లా కాశీపూర్ గ్రామానికి చెందిన మోమినుల్ ఇస్లాం అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన బోజో ఖాన్ కుమార్తెను 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమికులిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రేమ వివాదాన్ని ముగించేందుకు ప్రియురాలి బంధువులు ప్రియుడు మోమినుల్ ఇస్లాంను ఇంటికి పిలిపించారు. మొదట ప్రియుడు, ప్రియురాలి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ ప్రియుడు వినకపోవడంతో పెద్ద గొడవ జరిగింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి మోమినుల్ పెదవులను కోశారు. దీంతో ప్రియుడు రక్తంలోనే తడిసిపోయాడు.

Ms Dhoni: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంఎస్ ధోనీ.. మరి ఐపీఎల్ సంగతేంటి..?

ప్రియుడు సంఘటన స్థలం నుంచి ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసి కుటుంబ సభ్యులంతా షాక్ కు గురయ్యరు. వెంటనే అతన్ని బోల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందించగా.. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు బోల్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆ ఆస్పత్రిలో యువకుడికి సరైన వైద్యం అందడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం జరగ్గా.. ప్రియురాలి ఇంటిపై ప్రియుడి బంధువులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

Exit mobile version