మనోహరబాద్ (మం)కాళ్ళకల్ లో ప్రేమ జంటపై పోలీసుల ముందే యువతి కుటుంబ సభ్యుల దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మేడ్చల్ లో ఉంటున్న మెదక్ జిల్లా మనోహరబాద్ (మం) కొనాయిపల్లికి చెందిన సాయినాథ్ కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ములుగు (మం) కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read:Nagpur: “ప్రేమ”ను ఒప్పుకోలేదని, విద్యార్థిని హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..
ఈ క్రమంలో ఓ గుడిలో పెళ్లి చేసుకుని తమకి రక్షణ కావాలని మనోహరబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమ జంటను మేడ్చల్ తీసుకెళ్తుండగా కాళ్ళకల్ వద్ద NH 44పై యువతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసుల ముందే యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు యువతి కుటుంబ సభ్యులు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
