మీ ఫోన్ పోయిందా.. ఐతే దిగులు పడకంటి అంటున్నారు పోలీసులు. జస్ట్ సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే రికవరి చేస్తామని చెబుతున్నారు. అలా రికవరీ చేసిన ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందించారు. ఫోన్ పోయిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీఈఐఆర్ పోర్టల్‌లో మీ ఫోన్ వివరాలు పొందుపరచండి. దానికి తోడు పోలీసులు ఇచ్చే రిసిప్ట్‌ని జతపరచండి. అంతే మీ ఫోన్ ఎక్కడకైనా పోలీసులకు ఇట్లే తెలిసిపోతుంది. రికవరీ చేసి పోలీసులు తెచ్చి ఇస్తారు. పోయిన ఫోన్లు అన్నిటిని కూడా అధికారులు తెచ్చి బాధితులకు అప్పగిస్తున్నారు. అలా దొరికిన ఏకంగా 5 కోట్ల రూపాయల విలువచేసే ఫోన్‌లోను అధికారులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు..
READ MORE: Zohran Mamdani: “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”కి బుర్ఖా.. మమ్దానీ గెలుపు తర్వాత ఇస్లామోఫోబిక్ పోస్టులు..
ఇటీవల మొబైల్ ఫోన్లు చోరీకి గురికావడం.. మిస్సింగ్ కావడం ఎక్కువగా జరుగుతుందని.. సెల్‌ఫోన్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. రాచకొండ పరిధిలో చోరీ, మిస్సింగ్‌కు గురైన 1,130 ఫోన్లను రికవరీ చేసి, ఆయా ఫోన్‌ల యజమానులకు అప్పగించారు. సెంట్రల్ ఇక్విప్‌మెంట్ ఐడెంటీటీ రిజిస్ట్రీ ద్వారా పోయిన ఫోన్లను గుర్తించి, వాటిని రికవరీ చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి సీసీఎస్ పోలీసులు ఐటీ సెల్ సహకారంతో ఈ ఫోన్లను రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. రెండు నెలల వ్యవధిలో 5 కోట్ల విలువైన 1130 మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందాలు రికవరీ చేశాయన్నారు. ఆయా సెల్‌ఫోన్ల యజమానులకు సీపీ ఫోన్లను అప్పగించి.. రాచకొండ పోలీసుల పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పోయిన ఫోన్లు తమ చేతికి అందడంతో సెల్‌ఫోన్ యజమానులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు..
