ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బంతితో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ సుందర్ 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఐదవ రోజు భారత్ ఛేదనలో వాషీ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేదు. నాలుగు బంతులను బంతులను ఆడిన సుందర్.. ఒక్క పరుగు కూడా చేయలేదు.
Also Read: Air India Plane Crash: విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి?.. అమెరికా మీడియాకి ఎలా లీకైంది?
భారత్ రెండవ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు.. రెండవ స్లిప్‌లో ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ స్లెడ్జ్ చేశాడు. ‘వచ్చే మ్యాచ్ ప్లేయింగ్ 11లో నీకు చోటు దక్కదు’ అని బ్రూక్ అన్నాడు. ఇంగ్లండ్ పోకిరి మైండ్ గేమ్ బాగా వర్కౌట్ అయింది. సుందర్ నాలుగు బంతులకే అవుట్ అయ్యాడు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అతడిని అవుట్ చేశాడు. ఆర్చర్ బంతిని వేయగా.. వాషీ బ్యాట్‌ను తాకిన బాల గాల్లో లేచింది. ఆర్చర్ తన కుడి వైపుకు డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. దాంతో ఆర్చర్ సహా బ్రూక్ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
You cannot do that Jofra Archer!
Out of this world 😱 pic.twitter.com/mGNpgKPphl
— England Cricket (@englandcricket) July 14, 2025