NTV Telugu Site icon

Lord Shiva Statue Issue : శివుని విగ్రహ ప్రతిష్ట వివాదం

Lord Shiva Statue

Lord Shiva Statue

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులో శివుని విగ్రహ ప్రతిష్ట వివాదంగా మారింది. హిందూ స్మశాన వాటికలో శివుడి విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దళిత సంఘాలు అడ్డుపడ్డాయి. తమ ఇళ్లకు ఎదురుగా కనిపించేలా శివుడి విగ్రహం వద్దంటూ అడ్డుకున్నారు దీనితో వివాదం చినుకు చినుకు గాలివానలా మారింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలము కోటపాడు గ్రామములో సర్వే నెంబర్ 180 కాలి దారి స్తలములో పూర్వము నుండి హిందూ స్మశాన వాటికకూ 0.30 సెంట్లు , SC స్మశానము కొరకు య 0.50 సెంట్లు భూమిని వినియోగిస్తున్నారు. హిందూ స్మశాన వాటిక చుట్టూ ప్రహరి నిర్మాణము చేసుకొని అందులో శివుని విగ్రహము ప్రతిస్ట చేయుటకు ప్రయత్నం చేయగా కోటపాడు గ్రామ దళిత సంఘాలు ఆందోళనకు దిగారు.

Also Read : Karumuri Nageswara Rao : లోకేష్‌.. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు

శివుని విగ్రహం SC పేటకు ఎదురు ముఖముగా ఉండుటచే అరిష్టం కలుగుతుందని దళితులు అభ్యంతరము తెలియజేశారు. ఇరువురి పెద్దలతో తాసిల్థారి మాట్లాడి విగ్రహము ప్రతిస్ట నిలుపుదల చేశారు. ఈ మేరకు గ్రామం పెద్దలతో పీస్ కమిటీ ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయము తీసుకొను వరకు గ్రామములో అవాంచనీయ సంఘటనలు జరుగ కుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.. సమస్య పరిష్కారానికి తహశిల్దార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో రంగంపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read : Odisha Minister : కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూత