Site icon NTV Telugu

Murugan Devotees Meet: నేడు మధురైలో మురుగన్ భక్తుల సమ్మేళనం.. హాజరుకానున్న యోగి, పవన్‌‌ !

Lord Murugan

Lord Murugan

హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో నేడు ‘మురుగన్ మహా భక్త సమ్మేళనం’ జరగనుంది. మధురైలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్త సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు హిందూ మున్నణి సంస్థ అధ్యక్షుడు కాడేశ్వర సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు. అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భక్త సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.

Also Read: Today Horoscope: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!

మురుగన్ మహా భక్త సమ్మేళనం కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి అదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా సేవ్ టెంపుల్స్ భారత్ జాతీయ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మహా సమ్మేళనం నేపథ్యంలో గత 15 రోజులుగా యోగి, పవన్‌‌, బీజేపీ నేతలు ఉపవాసం ఉంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సనాతనధర్మ హిందూ బంధువులు కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు ఉంటాయి.

Exit mobile version