Site icon NTV Telugu

LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక స్టోరీ ఏంటో చెప్పిన లోకేష్ కనకరాజ్

Lokesh Kanakraj Press Meet

Lokesh Kanakraj Press Meet

తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ కూలీ సినిమాతో భారీ నెగిటివిటి తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేసారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒకడగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచం గ్యాప్ తీసుకుని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్‌తో సినిమా సెట్ చేసాడు. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు కూడా. అయితే బన్నీతో సినిమాకు ముందు కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది లోకి. కానీ కూలీఎఫెక్ట్ గా ఆ సినిమాను పక్కనబెట్టాడు. ‘ఖైదీ’తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లోకేశ్, ఆ కథకు సీక్వెల్ తీసుకురావాలని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

‘ఖైదీ 2’ ఆలస్యం అవ్వడంపై వస్తున్న పుకార్లకు కూడా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. లోకి మాట్లాడుతూ ‘ ఖైదీ 2  ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు, తన ఇతర  కమిట్‌మెంట్ల వల్లే ఈ గ్యాప్ వచ్చింది, ముఖ్యంగా రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు  చేయమనడంతో ఒకటిన్నర నెలల పాటు స్క్రిప్ట్‌పై చిత్తశుద్ధితో పనిచేశాన. అయితే వారు వరుసగా చాలా యాక్షన్ సినిమాలు చేయడంతో ఒక సింపుల్ కథ కావాలని భావించడంతో నాకు  సింపుల్ కథ  ఎలా చేయాలో తెలియదు, కాబట్టి నేను ఈ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి, ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాను, ఆ కారణరంగా ఖైదీ 2 వాయిదా వేశాను. ఇప్పుడు బన్నీతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయగానే ఖైదీ 2 తప్పకుండా చేస్తాను, అలానే విక్రమ్ 2 తో పాటు రోలెక్స్ సినిమా కూడా చేస్తాను’ అని అన్నారు.

Exit mobile version