Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్న మంత్రి లోకేష్, ఇప్పటికే సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. ఇది ప్రభుత్వ విద్యా విధానాలపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఈ విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషే ప్రధాన కారణమని లోకేష్ కొనియాడారు. విద్యార్థులు సాధించే మంచి ఫలితాలే ప్రభుత్వానికి నిజమైన ప్రచారమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపించడం రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో ఒక విశేషమైన ఘట్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని తెలిపారు మంత్రి నారా లోకేష్..
Also Read
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
తాజావార్తలు
-
Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
Dharmana Krishnadas: ‘ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే’.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!