Site icon NTV Telugu

Prakash Raj: మార్పుకోసం.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను : ప్రకాష్ రాజ్

New Project (7)

New Project (7)

Prakash Raj: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశప్రజలు తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేసి దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తున్నారు. సౌత్, బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రకంపనలు సృష్టించిన నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. నిత్యం తన రాజకీయ ప్రకటనల కారణంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తుంటాడు. ప్రకాష్ రాజ్ కూడా శుక్రవారం ఓటు వేశారు. ఈ సందర్భంగా సౌత్ సూపర్‌స్టార్ ఏమన్నారో తెలుసుకుందాం.

Read Also:Odela 2 : ‘ఓదెల 2’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం..గూస్ బంప్స్ తెప్పిస్తున్న వర్కింగ్ వీడియో..

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ, ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ- ‘హలో ఫ్రెండ్స్, నేను నా ఓటు వేసాను. మార్పు కోసం ఓటేశాను. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. సభలో మన గళం విస్తరిస్తుందని నేను విశ్వసించే ప్రాతినిధ్యానికి ఓటు వేసాను. మీరందరూ కూడా వెళ్లి ఓటు వేయండి. తద్వారా మార్పు రావచ్చు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

Read Also:Election: ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దు.. బయటకు వెళ్లి ఓటు వేయండి : ఎంపీ సుధామూర్తి

ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్‌పై పలు రకాల రియాక్షన్లు వస్తున్నాయి. ఓ నెటిజన్ ఖచ్చితంగా మార్పు తెద్దామంటూ కామెంట్ చేశాడు. ఇంకొకరు సార్, మీలాంటి నటులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పగలరు? అంటూ కామెంట్స్ చేశారు. పరిశ్రమలో అత్యంత పాపులర్ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఏడాదిలో ఎన్నో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం పుష్ప 2, దేవర, రాయన్, భగీరా, OG వంటి చిత్రాలలో కనిపించనున్నారు. అతను 2024 సంవత్సరం ప్రారంభంలో గుంటూరు కారం వంటి చిత్రంలో కనిపించారు.

Exit mobile version