“సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అంతకుముందు.. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సోమవారం కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రూ. 889.07 కోట్లతో వర్సిటీని నెలకొల్పనున్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు అక్టోబర్ లో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని గత సర్కార్ గతంలోనే గుర్తించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రతినిధులు సైతం ఈ స్థలాన్ని పరిశీలించి, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు.
Lok Sabha: “సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం.
Show comments