Site icon NTV Telugu

Solar Plant: సోలార్ పవర్ ప్లాంట్ పనులను అడ్డగించిన స్థానికులు

Solar Plant

Solar Plant

Solar Plant: సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ పనులు తమకు కాకుండా వేరే కంపెనీకి ఎలా ఇస్తారంటూ వారు నిలదీశారు. కడప జిల్లా కొండాపురం మండలం దొబ్బుడుపల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 2000 వేల కోట్ల రూపాయల పనులను మరో సంస్థకు అదానీ కంపెనీ అప్పగించింది. అయితే స్థానికులను కాదని వేరే కంపెనీకి పనులు ఎలా అప్పగిస్తారు అంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇదే సోలార్ పవర్ ప్లాంట్ వద్ద మట్టితోలే అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో మరోమారు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు.

Read Also: MLC Election: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తి

Exit mobile version