Site icon NTV Telugu

Uttar Pradesh: బాలికను వేధించిన ఇన్‌స్పెక్టర్‌.. స్తంభానికి కట్టేసి కొట్టిన స్థానికులు

Inspector

Inspector

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బాలికను వేధించాడనే ఆరోపణతో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ బర్హాన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఒంటిపై దుస్తులు తొలగించి స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆ తర్వాత స్వయంగా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అతని చర్యల గురించి వారికి తెలియజేశారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Read Also: Road Accident: ఓ పక్క పుత్రశోకం.. మరోపక్క వేల రూపాయలు డిమాండ్

నిందితుడు సందీప్‌ను కమిషనర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు బర్హాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ సింగ్ చౌహాన్ తెలిపారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం అర్థరాత్రి ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ బాలిక ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక యత్నానికి పాల్పడటంతో.. ఆమె కేకలు వేసింది. దీంతో పక్కన ఉన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఇన్‌స్పెక్టర్‌పై గ్రామస్తులు దాడికి సంబంధించిన వీడియో బయట పడింది. ఇన్‌స్పెక్టర్‌ను స్తంభానికి కట్టేసి కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి ఉండడం వీడియోలో కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు వ్యక్తులు అతన్ని కొట్టారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తగు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Read Also: EC: అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం

ఈ ఘటనపై ఎత్మాద్‌పూర్ ఏసీపీ మాట్లాడుతూ.. బర్హాన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ బాలికపై లైంగికయత్నం కేసులో సబ్-ఇన్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. అయితే వైరల్ వీడియో తమ దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసు బృందం గ్రామానికి చేరుకుని సమాచారం సేకరిస్తుంది.

Exit mobile version